calender_icon.png 19 September, 2024 | 9:53 PM

మహిళలు నిజమైన శక్తి స్వరూపాలు

17-09-2024 03:13:36 AM

  1. వారి భద్రత కోసం ప్రజాచైతన్యం పెంచాలి 
  2. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: సమాజంలోని ప్రతీఒక్కరికి మహిళా భద్రత, గౌరవంపై అవగాహన పెంచాల్సిన టైమ్ వచ్చిందని రాష్ట్రపతి దౌపది ముర్ము పేర్కొన్నారు. మహిళా సాధికారతపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంటుందని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. సీఎన్‌ఎన్‌ేొన్యూస్ 18 ఆధ్వర్యంలో ఆదివా రం నిర్వహించిన షీ శక్తి 2024 కార్యక్రమం లో ఆమె పాల్గొని మాట్లాడారు. ‘మన మహి ళలు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ముందుడుగు వేస్తున్నారు. మన దేశంలో ఆడవారికి భద్రత కల్పించేందుకు అనేక కఠి నమైన చట్టాలను రూపొందించారు. దుర దృష్టవశాత్తు అభద్రతా భావం ఇంకా కొన సాగుతోంది.

సంప్రదాయవాదం, సంకుచిత భావం లాంటి సామాజిక సమస్యలతో మహిళలు పోరాడుతున్నారు. అనేక మార్పు లు చోటుచేసుకున్నా.. ఏండ్ల తరబడి నాటుకుపోయిన సామాజిక భావనలు మహిళా సమానతకు అడ్డంకిగా మారుతు న్నాయి. ప్రస్తుత పరిస్థితి మెరుగయ్యేం దుకు మనం ఏం చేయాలనేది ప్రశ్నించుకోవాలి. మహిళల భద్రత, గౌరవం అనేవి దేశ ప్రగతికి చాలా కీలకం. కొన్ని వందల ఏండ్ల కిందటే మన దేశానికి మాతృ హోదా ఇచ్చాం. 

మనం పుట్టిన ప్రదేశాన్ని తల్లిగా, మహి ళలను దేవతలుగా పూజించే సంస్కృతి మన ది. ఒక వైపు దుష్ట సంహారం చేసే కాళీ, దుర్గగా.. మరోవైపు ఆశీర్వదించే లక్ష్మీ, సరస్వతిగా ఆరాదిస్తాం. మహిళలు నిజమైన శక్తి ప్రతిరూపాలు” అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ సారి షీశక్తి కార్యక్ర మాన్ని ‘బ్రేకింగ్ బ్యారియర్స్’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి అనుభవా లను పంచుకోనున్నారు.