calender_icon.png 23 November, 2024 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైక్ పింక్‌లో మహిళలే డ్రైవర్లు

22-11-2024 12:00:00 AM

ప్రస్తుత కాలంలో ఆటో, ట్యాక్సీల మీద ఆధారపడే ప్రయాణికులు ఎక్కువయ్యారు. వీటితో పాటు బడ్జెట్లో ఉండే బైక్ ట్యాక్సీలకు కూడా ఆదరణ ఎక్కువగానే ఉంది. అయితే ఆయా సంస్థల యాప్‌లలో బైక్ ట్యాక్సీ కోసం బుక్ చేస్తే మగవారే ఎక్కువగా వస్తారు. దీంతో కొందరు మహిళా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని గుర్తించిన ‘ర్యాపిడో’ సంస్థ చెన్నైలో ‘బైక్ పింక్’ ను ప్రారంభించింది.

ఇది మహిళా ప్రయాణికులకు భద్రతను ఇవ్వడమే కాదు, ఎంతోమంది మహిళలకు డ్రైవర్‌లుగా ఉపాధిని ఇస్తుందని ‘ర్యాపిడో’ ప్రకటించింది. ‘పింక్’ యాప్‌లో బుక్ చేసుకుంటే మహిళా డ్రైవర్లు మాత్రమే వస్తారు. ‘పింక్’ ద్వారా మహిళలకు సౌకర్యం, భద్రతా అనేది ఒక కోణం అయితే ఎంతోమంది మహిళలు దీనిద్వారా ఉపాధి పొందుతున్నారనేది మరో కోణం. మహిళా డ్రైవర్‌లను ‘వుమెన్ కెప్టెన్’గా వ్యవహరిస్తారు. ప్రస్తతం వివిధ సంస్థల్లో మహిళా బైక్ టాక్సీ డ్రైవర్లు ఉన్నారు కానీ వారి సంఖ్య చాలా తక్కువ. ఇటువంటి చర్యలు తీసుకుంటే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.