calender_icon.png 6 March, 2025 | 9:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు

06-03-2025 12:40:28 AM

యాదాద్రి భువనగిరి, మార్చి 5 (విజయక్రాంతి): మహిళలు అన్ని రంగాలలో ముందు ఉన్నారని జిల్లా కలెక్టర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం  పురస్కరించుకొని  కలెక్టర్ హనుమంతరావు  మహిళా ఉద్యోగులకు   ఆటల పోటీలను కలెక్టరేట్ ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మహిళలు అన్ని రంగాలతో పాటు క్రీడలలో కూడా పాల్గొని మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృడత్వము, మనసు ఏకగ్రత కలిగి ఉండాలని అదేవిదంగా  అన్నీ రంగాలలో ముందుండాలన్నారు.  జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్  వీరా రెడ్డి మాట్లాడుతూ క్రీడల వల్ల పని ఒత్తిడి తగ్గించుకోవచ్చని అందరూ కూడా క్రీడలు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు  వెళ్ళాలని కోరారు.

జిల్లా అడిషనల్ కలెక్టర్  గంగాధర్ (లోకల్ బాడీ) మాట్లాడుతూ  మహిళలు ఉధ్యోగ బాధ్యతలతో  పాటు మానసిక ఉల్లాసం ఉంటుందని మహిళాలు క్రీడలలో కూడా ముందుండాలని కోరారు. జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి  కె. ధనంజనేయులు  మాట్లాడుతూ  మహిళలు క్రీడా స్పూర్తి తో మానసికంగా, శరీరకంగా ఎదిగి మన జీవితములో ఎన్నో రకాల సమస్యలను పరిష్కరించుకోవచ్చ న్నారు.

ఇందులో బాగంగా క్రీడలు  నిర్వహించు తేదీలు : ఈనెల 5 6 7 3 రోజుల పాటు  కల్లెక్టర్  కార్యాలయ ప్రాంగణంలో  టెన్నికయిట్, షటిల్ ,చెస్, క్యారమ్స్, స్కిప్పింగ్, లెమన్ అండ్ స్పూన్, స్పీడ్ వాక్, రన్నింగ్, మ్యూజికల్ బాల్, గ్లాస్ పిరమిడ్ , సింగింగ్, మ్యూజికల్ చైర్ మొదలగు క్రీడలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

ట్టి కార్యక్రమానికి  జిల్లా పరిషత్ సి.ఇ.ఓ. శోభారాణి, యదాద్రి లక్ష్మి నర్సింహా స్వామి దేవాదాయశాఖ ఈ.ఓ. భాస్కర్ రావు , స్టేట్ ట్రెజరీ & జేఏసీ చైర్మన్ ఉపేందర్ రెడ్డి , స్టేట్ గేజిటెడ్ అఫ్ఫిసర్స్ అసొసెషన్  ప్రెసిడెంట్ జగన్, SGF సెక్రటరీ దశరథ రెడ్డి , వివిద పాటశాలల  పీఈటీలు అదేవిదంగా అన్ని రకాల ప్రభుత్వ శాఖలకు సంభందించిన  500 మంది మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.  6, 7, తేదీలలో  నిర్వహించు  క్రీడలలో  ఆసక్తి గల మహిళ ఉధ్యోగులు అధిక  సంఖ్యలో పాల్గొనాలని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ  అధికారి కె ధనంజనేయులు కోరారు.