calender_icon.png 25 January, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు ఆర్థిక సంపద పెంచుకునేందుకు ప్రోత్సాహం

24-01-2025 06:49:57 PM

ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్...

దస్తురాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రంలో అధికారులు ఉన్న ప్రజా పాలన ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా ఎదిగి సంపద సృష్టించేందుకే ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) అన్నారు. శుక్రవారం కడెం మండల కేంద్రంలో డిఆర్డి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య యోజన, ఇందిరా మహిళా శక్తి పథకం కింద శిక్షణ పొందిన 26 మంది మహిళలకు అభినందించి ప్రశంసించారు. కడెం ఖానాపూర్ ప్రాంతాల్లో లభించే చేపల వల్ల ఆహార ఉత్పత్తులను తయారుచేసి మార్కెట్ కు విక్రయించేందుకు వీరికి శిక్షణ ఇవ్వడం ఎంతో అభినందనీయమని తెలిపారు. త్వరలో మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్ లు ఎలక్ట్రికల్ బస్సులను అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ విజయలక్ష్మి, మాస్టర్ ట్రైనర్ దేవేందర్, అధికారులు ఉన్నారు.