calender_icon.png 11 March, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు, పిల్లలు ఆత్మరక్షణ కలల్లో ప్రావీణ్యం పొందాలి..

02-02-2025 05:00:47 PM

బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంటు జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): మహిళలు, పిల్లలు ఆత్మరక్షణ కళలల్లో ప్రావీణ్యం పొందాలని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆదివారం గాంధీనగర్ డివిజన్ లోని కెనరా బ్యాంక్ పార్క్, జీహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్స్ లో హైదరాబాద్ టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ నిర్వాహకుడు మాస్టర్ బి. కృష్ణ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్, కలర్స్, బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, రాష్ట్ర జెన్ సెక్రటరీ మీ వహాజ్ అలీ ఖాన్ లు హాజరయ్యారు.

శిక్షణ పొందుతున్న 80 మందికి పైగా, కలర్ బెల్స్, సర్టిఫికెట్స్ ను అందజేశారు. టైక్వాండో రాష్ట్ర కార్యదర్శి మీర్ వహాజ్ అలీ ఖాన్ సర్టిఫికెట్ పొందిన వారిని అభినందించారు.ఈ సందర్భంగా ఎ. వినయ్ కుమార్ మాట్లాడుతూ... విద్యార్థులు చదువుతోపాటు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందితే తమ స్వయం రక్షణ కొరకు ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళలు కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఆత్మరక్షణ, ఆరోగ్యం పెంపొందించుకోవచ్చని అన్నారు. బెల్ట్, సర్టిఫికెట్లు అందచేసిన అనంతరం విద్యార్థులకు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జామినర్ సంజయ్ సింగ్, కోచ్ లు  మనీష్, రఘు, ఎస్. స్వామి, క్రీడాకారులు పాల్గొన్నారు.