calender_icon.png 19 April, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓరుగల్లు బీఆర్‌ఎస్ సభలో మహిళలకూ భాగస్వామ్యం!

19-04-2025 01:31:31 AM

సభ ఏర్పాట్లపై జిల్లా మహిళా నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ భేటీ

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో  ఈనెల 27న జరుగనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో మహిళల భాగస్వా మ్యమూ ఉండాలని  బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు. పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పా ట్లపై తన ఎర్రవెల్లి నివాసంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో శుక్రవారం కేసీఆర్ సమావేశం నిర్వహించారు.

సభ విజయవంతంలో మహిళల భాగస్వామ్యమూ ఉండాలని, అందుకు అనుస రించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించి వారికి ఆయన సూచనలు చేశారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు కవిత, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో పాటు హన్మకొండ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఒడితెల సతీష్ కుమార్, పార్టీ మహిళా నేతలు, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, టీజీపీఎస్సీ మాజీ మెంబర్ సుమి త్రా తనోబా, గిడ్డంగుల శాఖ మాజీ ఛైర్‌పర్సన్ రజినీ సాయిచంద్, పార్టీ నేతలు ఆశన్న గారి జీవన్ రెడ్డి, బాలమల్లు, కల్వకుంట్ల వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.