17-03-2025 12:00:00 AM
పోలీసుల అదుపులో నిందితులు?
నిజాంసాగర్ (విజయక్రాంతి): ఆటో కోసం వేచి ఉన్న మహిళ ను గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో తీసుకెళ్లి వదిలిపెడతామని చెప్పి ఆటోలో మహిళను ఎక్కించుకుని ఆమె ఒంటిపై ఉన్న నగలను దోచుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. సంఘటనకు సంబం ధించిన వివరాలు.. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ బస్టాండ్‌లో శనివారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా కలి హేరు మండలం మార్డి గ్రామానికి చెందిన మ్యాతరీ భూమవ్వ అనే మహిళా తన కూతురి ఇంట్లో పూజ ఉన్న దని నిజాం సాగర్ మండల కేంద్రానికి వచ్చింది.
సమీపంలో ఉన్న తన కూతురు గ్రామం అచంపేటకు వెళ్లేందుకు ఆటో కోసం ఎదురుచూస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి తాము అచ్చంపేట వెళ్తామని ఆటోలో ఎక్కుమని చెప్పి మహి ళను ఆటోలో ఎక్కించుకొని మార్గమధ్యంలో నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి ఆమె ఒంటిపై ఉన్న రెండు తులాల బంగారు నగలు ఇరువై తులాల వెండి నగలను దోచుకున్నారు.
అనంతరం అమె ను విడిచిపెట్టి ఆటోలో పరారయ్యారు. బాధితురాలు తన కూతురు గ్రామమైన అచ్చంపేటకు వెళ్లి తాను మోస పోయిన విషయాన్ని కూతురు కుటుంబ సభ్యులకు చెప్పడంతో శనివారం రాత్రి నిజాంసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు సిసి కెమెరాలు పరిశీలించి చోరీకి పాల్పడ్డ వారిని గుర్తించి ఆదివారం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
ఈ విషయమై నిజాంసాగర్ ఎస్‌ఐ శివకుమార్ ను వివరణ కోరగా కేసు నమోదు చేసు కొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివకుమార్ తెలిపారు. పూర్తి సమా చారం ఆధారంగా సీసీ కెమెరా ఫుటేజ్ ఆధా రంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.
పోలీసులకు పట్టుబడ్డ వారు గతంలో కూడా చోరీలకు పాల్పడి ఉండవచ్చని స్థానికులు భావిస్తు న్నారు. పోలీసులు పూర్తి వివరాలు వెల్లడిస్తేనే పట్టుబడ్డ దొంగల వివరాలు వెల్లడి అయ్యే అవకాశాలు ఉన్నాయి.