01-04-2025 06:21:44 PM
నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో కుటుంబసభ్యులతో కలిసి దైవదర్శనానికి వచ్చినా ఓ మహిళను మానవ మృగాలు దాడి చేసి అత్యాచారం చేసినా విషయం తెలిసిందే. మంగళవారం ఊర్కొండాపేటలో అత్యాచార ఘటనాస్థలిని మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ(IG Satyanarayana) పరిశీలించారు. అనంతరం ఐజీ మీడియాతో మాట్లాడుతూ... కేసుకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు తెలిపారు. అత్యాచారం కేసులో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని, మహిళాలు ఒంటరిగా రావడాన్ని నిందితులు అదునుగా తీసుకున్నారని ఐజీ సత్యనారాయణ అన్నారు.
దాడి చేసినా వారికి కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు(Fast Track Court) ద్వారా విచారణ జరిపిస్తామన్నారు. నిందితులు గతంలో బెదిరించి దోపిడీలకు పాల్పడినట్లు కేసులు ఉన్నాయని, పార్కులకు వచ్చే మైనార్లను బెదిరించి డబ్బులు లాక్కునేవారని తెలిపారు. నిందితులు ఎవరెవరి వద్ద డబ్బులు లక్కున్నారో వివరాలు సేకరించి, జాతరలు జరిగే ఆలయాల వద్ద గస్తీ పెంచుతామని ఐజీ సత్యనారాయణ వెల్లడించారు.