calender_icon.png 29 November, 2024 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చందానగర్‌లో మహిళా ఆత్మహత్య

29-11-2024 04:04:26 PM

భర్త వేధింపులే కారణమంటూ సోదరుడు ఫిర్యాదు 

చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన 

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): గత కొన్ని నెల రోజులుగా సమాజంలో ఆత్మహత్యల వార్తలు ప్రతి రోజూ వింటూనే ఉన్నాం. ఏ చిన్న చితక సమస్య వచ్చినా, పెద్ద సమస్యగా వాటిని తట్టుకోలేక అనేక మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలకు, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ,పెళ్లి, భార్యా లేదా భర్త వేధింపులు ఇలా అనేక విషయాల్లో కొంత మంది యువతీ,యువకులు,మహిళలు పురుషులు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని తమ విలువైన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆత్మహత్యల పాల్పడుతున్నారు. ఎలాంటి సమస్య వచ్చిన ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలే కానీ ఆత్మహత్య మహా పాపం. ఐతే సమస్యల ఊబిలో చిక్కుకుపోయిన పలువురు వాటిని నుంచి బయటకురాలేక తమ ప్రాణాలు పణంగా పెడుతున్నారు. సరిగ్గా చందానగర్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడంశోచనీయం. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు,మున్నీరుగా విలపిస్తున్నారు.

చందానగర్‌లో ఓ మహిళ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. భర్త నర్సింగ్ రావుతో కలిసి చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకర్ నగర్‌లో స్రవంతి(35) అనే మహిళ నివాసం ఉంటోంది. అయితే నిన్న (గురువారం) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఊరి వేసుకొని మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అంతకుముందు సోదరుడు సుధీర్‌కు స్రవంతి ఫోన్ చేసింది. అయితే డ్రైవింగ్‌‌లో ఉన్న సుధీర్ స్రవంతి కాల్‌ను లిఫ్ట్ చేయలేదు. ఆ తరువాత మూడు సార్లు కాల్ చేసినప్పటికీ స్రవంతి లిఫ్ట్ చేయలేదు. ఆపై స్రవంతి ఆత్మహత్య చేసుకున్నట్లు సుధీర్‌కు సమాచారం అందింది. దీంతో వెంటనే అతను హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నాడు. అలాగే స్రవంతి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని సోదరుడు సుధీర్ కుటుంబసభ్యులకు చెప్పాడు. కాగా తన బావ నర్సింగ్ రావు వేధింపులు తాళలేక తన సోదరి ఆత్మహత్యకు పాల్పడినట్లు సుధీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. మృతురాలు స్రవంతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న చందానగర్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.