హైదరాబాద్: ఓ యువతి రాంనగర్ చౌరస్తా సమీపంలో అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. చిక్కడపల్లి పీఎస్ పరిధిలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని గిరి శిఖర అపార్ట్మెంట్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అపార్ట్మెంట్ లోపలికి వెళ్లిన సనా బేగం (23) 5వ అంతస్తు టెర్రస్ పైకి వెళ్ళింది. ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా ఆమె కిందకి దూకడంతో సనా బేగం అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు, క్లూస్ టీం సంఘటన స్థలం వద్ద వివరాలు సేకరించారు. సనా బేగం ఎందుకు మృతి చెందింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలను చిక్కడపల్లి పోలీసులు పరిశీలిస్తున్నారు. సనా బేగం మృతి పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.