హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 2 (విజయక్రాంతి): తన భర్త, కుమారుడిపై అక్రమ కేసు పెట్టారని ఆరోపిస్తూ ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. దుబ్బాక మండలం రాగోంతపల్లి గ్రామానికి చెందిన సింగిరెడ్డి కవిత భర్త భీంరెడ్డికి, అతని సోదరుడు సాయిరెడ్డికి మధ్య కొంతకాలంగా భూవివాదం ఉంది. ఈ క్రమంలో జరిగిన గొడవ కారణంగా కవిత భర్త, కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో, తన భర్త, కుమారుడిపై కేసు ఎలా పెడతారని కవిత పోలీసులతో వాగ్వావాదా నికి దిగింది. సరైన ఆధారాలతోనే కేసు నమోదు చేసినట్లు పోలీసులు బదులివ్వడంతో, పోలీస్ స్టేషన్ గేటు దగ్గరకు వెళ్లి తన వెంట తెచ్చుకున్న ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది.