calender_icon.png 16 April, 2025 | 7:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతి హిజాబ్ తీసి.. హిందూ యువకుడిపై దాడి

15-04-2025 12:09:13 AM

యూపీలో అల్లరిమూక దుశ్చర్య

లక్నో, ఏప్రిల్ 14: యువతి హిజాబ్ తీయించి, ఆమెతో వచ్చిన హిందూ యువకుడిపై దాడి చేసిన కేసులో ఆరుగురు నిందితులను యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతున్న వీడియో ఆధారంగా త్వరలో మరికొందరిని అరెస్ట్ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఫర్హానా అనే మహిళ ఖాలాపార్‌లోని ఓ ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నది.

ఆమెకు ఫర్హీన్ అనే 20ఏళ్ల కూతురు ఉంది. తన తల్లి సూచనల మేరకు  ఈనెల 12న సచిన్ అనే యువకుడితో కలిసి ఈఎంఐ వసూలు చేసేందుకు మోటరు సైకిల్‌పై వెళ్లింది. దుండగులు వారిని అడ్డగించి, దాడికి పాల్పడ్డారు. ఫర్హీనా ధరించిన హిజాబ్‌ను ఓ వ్యక్తి బలవంతంగా విప్పగా మిగిలిన కొందరు యువకులు సచిన్‌పై చేయి చేసుకున్నారు. వీడియో ఆధారంగా పోలీసులు కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు చిక్కాల్సి ఉంది.