calender_icon.png 22 February, 2025 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా స్థలాన్ని ఇప్పించండయ్యా..!

21-02-2025 12:19:15 AM

మధిర తహసీల్దార్ ఆఫీస్ ఎదుట వృద్ధు రాలి నిరసన 

ఖమ్మం / మధిర, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి) : అక్రమార్కుల చెర లో వున్న నా స్థలాన్ని తిరిగి నాకు అప్పగించండయ్యా.. అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారి పోయాను.. ఇప్పటికైనా నా సమస్య పరిష్కరిస్తేనే ఇక్కడ నుంచి కదులుతా.. లేకపోతే ఇక్కడే ఉండి పోతానంటూ ఓ 85 ఏళ్ళ వృద్దురాలు గురువారం మధిర తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసనకు దిగింది. మధిర మండలం దెందుకూరు గ్రామానికి చెందిన 85 ఏండ్ల కనకపూడి కరుణమ్మ, ఆక్రమణకు గురైన తన ఇంటి స్థలం కోసం మధిర తహసీల్దార్ కార్యాలయంలో అనేక సార్లు ఫిర్యాదు చేసింది.

అధికారికి ఎన్నిసార్లు గోడు వెళ్లబోసుకున్నా సమస్య తీరకపోవడంతో గురువారం  ఆఫీస్ ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకొని నిరసనకు దిగింది. ఈ సందర్భంగా  వృద్ధురాలు కనకపుడి కరుణమ్మ మాట్లాడుతూ తన ఇంటి స్థలాన్ని కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఆక్రమించు కున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై తహసీల్దార్ కార్యాలయంలో అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేసారిపోయి చేసేదేమీ లేక నిరసన దీక్షకు కూర్చోవడం జరిగిందని వాపోయింది.ఇప్పటికైనా ఉన్నత అధికారులు తన స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుని తన స్థలాన్ని తనకు ఇప్పించాలని వేడుకుంది.అయితే వృద్దురాలి స్థలం ఆక్రమించిన వారికి నోటీసులు జారీ చేశామని, సరైన పత్రాలు చూపించిన వారికి న్యాయం చేస్తామని తహసీల్దార్ రాంబాబు తెలిపారు.