23-02-2025 12:38:14 AM
హోటల్ టెర్రస్‌పైకి తీసుకెళ్లి అఘాయిత్యం
పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
బెంగళూరు: బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో శుక్రవారం ఒక మహిళపై నలుగురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. పాత పరిచయమస్తులమని చెప్పి సదరు మహిళను కోరమంగళలోని ఒక హోటల్ టెర్రస్‌పైకి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. లైంగిక దాడి అనంతరం మహిళ నుంచి డబ్బులు, నగలు దోచుకొని ఆమెను బలవంతంగా బయటకు పంపించినట్లు తేలింది. కాగా మహిళ అత్యవసర నంబర్ 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారమిచ్చింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకోగా.. మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అనుమానితులను పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్‌కు చెందిన అజిత్, విశ్వాస్, శివులుగా గుర్తించారు. వీరంతా హోటల్‌లోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లో పనిచేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మహిళ ఫిర్యాదుతో గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. లైంగిక దాడికి గురైన బాధితురాలు ఢిల్లీకి చెందిన మహిళ గా గుర్తించామన్న పోలీసులు ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో ఉందని, పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.