ఇంట్లో భార్యను కొడుతున్నాడనో, సరిగా చూసుకోవడం లేదనో, మనస్పర్థల వల్లో విడాకులు తీసుకునే వాళ్లనే చూసేఉంటారు. కుర్ కురే ప్యాకెట్ అడిగితే తేలేదని ఓ భార్య తన భర్తనుంచి విడాకులు కోరిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో షాహ్ గంజ్ లో చోటుచేసుకుంది. జోక్ అనుకుంటున్నారు. కాదు బాబోయ్ ఇది నిజం. ఆగ్రాలోని షాహ్ గంజ్ లో ఈ దంపతులు నివాస ముం టున్నారు. మహిళ కుర్ కురే చిప్స్ టేస్ట్ కి అడిక్ట్ అయింది. భర్తను ప్రతిరోజూ తీసుకురావాలని అడిగేది, భర్త ఒకరోజు తీసుకెళ్లడం మరిచిపోవడంతో వారిద్దరి మధ్య గొడవ మొదలై.. అది కాస్త పెద్ద వివాదానికి దారి తీసింది.
ఈ నేపథ్యంలోనే కోపంతో పుట్టింటికి వెళ్లిపోయింది. అంతటితో ఆగకుండా భర్తకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయి, భర్తకు నోటీసులు పంపించింది. ఈ ఘటనపై ఆగ్రాలోని షాహ్‌గంజ్ పోలీసులు జోక్యం చేసుకుని దంపతులను ఫ్యామిలీ కౌన్సెలింగ్ కోసం పంపించారు. వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తనకు కుర్ కురే అంటే ఇష్టమని, పెళ్లైన కొత్తలో భర్త రోజూ తెచ్చేవాడని.. ఇప్పుడు తీసుకురాకపోవడం వల్లే సంసారంలో గొడవలు మొదలయ్యాయని ఆమె పోలీసులు ముందు పేర్కొంది.