calender_icon.png 24 September, 2024 | 2:55 AM

మహిళా పోలీసుపై బాణాలతో దాడి..

24-09-2024 12:50:16 AM

పాట్నా: బీహర్‌లోని అరారియా జిల్లాలో కొంత మంది అల్లరి మూక లు దాడి చేసి మహిళా పోలీసును గాయపర్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ భూవివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు వెళ్లిన మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్‌పై అల్లరి మూకలు బాణాలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను సహచర పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పోలీసు ప్రాణాలతో చెలగాటమాడిన మూకలను అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.