calender_icon.png 27 April, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్కేపూర్ శివారులో మృతి చెందిన మహిళ హత్యగా గుర్తింపు

26-04-2025 09:16:29 PM

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం: మంథని సీఐ రాజు

మంథని,(విజయక్రాంతి): మంథని మండలంలోని లక్కేపూర్ శివారులో ఉదయం మృతి చెందిన మహిళను హత్య చేసినట్టు గుర్తించామని మంథని సిఐ బి. రాజు తెలిపారు. మంథని సీఐ రాజు కథనం ప్రకారం... చెందగా గ్రామ శివారులో గుర్తుతెలియని మహిళా శవం కనిపించిందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్ఐ రమేష్ తో పాటు అక్కడికి వెళ్లి పరిశీలించి విచారణ చేయగా మహిళ మృతి చెందింది.

మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం, పెగడపల్లి గ్రామానికి చెందిన మాసు సత్యనారాయణ సతీష్(40) భార్య మాసు రమాదేవి(36)గా గుర్తించామని, ఆ మహిళ 25వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో శెట్టిపల్లి గ్రామానికి వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో నుండి బయలుదేరింది. రాత్రి అయిన ఇంటికి రాకపోవడంతో ఇవాళ గుర్తుతెలియని మహిళా మృతదేహం లక్కేపూర్ గ్రామ శివారులో ఉందని తెలియగా ఫిర్యాది అతని బంధువులు వచ్చి చూసి మృతురాలిని తన భార్యగా గుర్తించాడు. తన భార్యను హత్య చేశారని నిర్ధారించుకొని, తన భార్యకు పరిచయస్తుడైన లక్కేపూర్ గ్రామానికి చెందిన పండుగు మొగిలిపై అనుమానం ఉందని భర్త ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని సీఐ తెలిపారు.