10-03-2025 10:37:11 AM
హైదరాబాద్: గజ్వేల్ మండలం రిమ్మనగూడ(Rimmanaguda, Gajwel Mandal)లో సోమవారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి పదునైన ఆయుధంతో దాడి చేసి ఒక మహిళను దారుణంగా హత్య చేశాడు. బాధితురాలిని అస్రా (32)గా గుర్తించారు. దాడి సమయంలో ఆమె భర్త సాదత్ ఆమెను కాపాడటానికి ప్రయత్నించినప్పుడు, నిందితుడు అతనిపై కూడా దాడి చేశాడు. నిందితుడు అక్కడి నుండి పారిపోవడంతో సాదత్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బాధితుడి సమాచారంతో ఘటనాస్థలికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజ్వేల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గ్రామాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రస్తుతం నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.