calender_icon.png 18 January, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళ హత్య....

25-08-2024 02:41:35 PM

దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు 

గండీడ్: మహబూబ్ నగర్ జిల్లాలోని గండేడ్ మండల పరిధిలోని సర్కిల్ పేట గ్రామంలో ఓ మహిళ హత్యకు గురైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... కూలి నాలి చేసుకుంటూ గ్రామంలోని ఈడికి వెంకటమ్మ(55) అనే మహిళ గ్రామంలోని నివాసం ఉంటుంది. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు.

మహిళపై అనుచితంగా దాడి చేయడంతో మహిళ మృతి చెందినట్లు తెలుస్తుంది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మహిళా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు అనుమానితులు ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.