మహిళా అదృశ్యం
మేడిపల్లి,(విజయక్రాంతి): అపోలో ఫార్మసీలో మందులు కొనడానికి వెళ్లిన మహిళ అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చంగిచర్లలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెంగిచర్ల ప్రాంతానికి చెందిన బిక్షపతి నాయక్ అతని భార్య భూక్య తిరుమల(38) 21న రాత్రి 9:15 గంటల సమయంలో చెంగిచెర్ల లోని అపోలో ఫార్మసీలో మందులు కొనడానికి వెళ్లి, తిరిగి ఇంటికి రాలేదు.
కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలలో వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. వ్యాపార ఆర్థిక సమస్యల కారణంగా ఆమె ఇంటి నుండి వెళ్లి ఉండవచ్చునని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఈ మహిళా వివరాలు తెలిసిన వారు మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సీఐ శంకరయ్య తెలిపారు.






