31-03-2025 11:34:11 AM
దంతెవాడ: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా(Dantewada district)లో సోమవారం ఉదయం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళా మావోయిస్టు మృతి(Woman Naxalite) చెందింది. దంతెవాడ-బీజాపూర్ సరిహద్దులో నక్సలైట్స్ ఉన్నట్లు భద్రతా దళాలకు నిఘా వర్గాలు సమాచారం అందడంతో ఉదయం 9 గంటలకు ఎన్‌కౌంటర్(Encounter) ప్రారంభమైంది. దీంతో ఛత్తీస్‌గఢ్‌లో 2024లో 219 మంది మావోయిస్టులు మృతి చెందగా, ఈ సంవత్సరం వారి సంఖ్య 135కి చేరుకుంది. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని దంతెవాడ పోలీస్ సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్(Dantewada Superintendent of Police Gaurav Roy) తెలిపారు.
ఇప్పటివరకు, ఎన్‌కౌంటర్ స్థలం నుండి ఒక మహిళా నక్సలైట్ మృతదేహాన్ని, ఇన్సాస్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) మార్చి 2026 నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించిన తర్వాత, రాష్ట్రంలో తిరుగుబాటు వ్యతిరేక చర్యలు తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇది జరిగింది. విష్ణు దేవ్ సాయి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, 2024 ప్రారంభం నుండి మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల సంఖ్య పెరిగింది.