calender_icon.png 31 March, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నపేగును పోషించుకోలేనని హత్య

28-03-2025 09:11:07 AM

15 రోజుల పసికందును  చంపిన తల్లి

పసిగుడ్డు మృతి మిస్టరీని ఛేదించిన మైలార్ దేవ్ పల్లి పోలీసులు 

రాజేంద్రనగర్: ఓ మహిళ మాతృత్వానికి మచ్చ తెచ్చింది. నవ మాసాలు మోసి జన్మనిచ్చిన కన్న బిడ్డను పోషించుకోలేనని తన చేతులతోనే కడతేర్చింది. పసికందు అనుమానస్పద మృతి కేసును మైలార్ దేవ్ పల్లి పోలీసులు(Mailardevpally Police) ఛేదించారు. హత్య చేసిన తల్లిని అరెస్ట్ చేశారు. మైలార్ దేవ్ పల్లి ఆలీ నగర్ లో ఇటీవల హృదయ విదారక ఘటన ఇటీవల జరిగిన విషయం తెలిసిందే.  

భర్త రెండు కిడ్నీలు కుటుంబ పోషణ భారంగా మారింది. భర్త కు చికిత్స చేయించ లేక, కుటుంబాన్ని పోషించుకోలేక తల్లడిల్లిన విజ్జి చివరికి కన్న పేగును కడతేర్చింది. విజ్జి భర్త మనికి రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో డయాలసిస్ చేసుకోవడం, ఆ సమయంలోనే పండండి బిడ్డకు జన్మనివ్వడం కుటుంబ భారం మరీ భారంగా మారింది. ఏమి చేయాలో తోచక కన్న పేగును విజ్జి కడ తేర్చింది. ఈ నేపథ్యంలో 15 రోజుల పాపను బకెట్ లో ముంచి హత్య చేసింది. అనంతరం ఏమి తెలియనట్లు బకెట్ లో పడిపోయింది అంటూ డ్రామా ఆడింది. తమిళనాడుకు చెందిన దంపతులు విజ్జి, మని దంపతులు పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ వచ్చి మైలార్ దేవ్ పల్లిలో ఉంటూ కాటేదాన్ లోని ఓ బిస్కెట్ పరిశ్రమలో పనిచేసేవారు.