నిర్మల్, అక్టోబ ర్ 21 (విజయక్రాంతి): కోతుల దాడిలో మహిళ మృతి చెందిన ఘటన సోమవా రం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో జరిగింది. నిర్మల్‌కు చెందిన భోగుల లక్ష్మి ఇంట్లో పనులు చేసుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా కోతుల మంద దాడి చేసింది. దీంతో లక్ష్మి పరిగెత్తుతూ కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యా యి. వెంటనే నిర్మల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.