calender_icon.png 10 March, 2025 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనిషి పుట్టుక, మనుగడకు మహిళే ఆధారం

10-03-2025 12:44:47 AM

బీఆర్‌ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

కుత్బుల్లాపూర్, మార్చి 9 (విజయ క్రాం తి): మనిషి పుట్టుక, మనుగడకు మహిళే ఆధారమని బిఆర్‌ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ అన్నారు.కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రాజీవ్ గాంధీ నగర్ లో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి బిఆర్‌ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్, సినీనటి శివపార్వతి  ముఖ్యఅతిథులుగా హాజర య్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక ఇంటిలోని మహిళ చదువు కుంటే కుటుంబంతోపాటు తర్వాతి తరాలు ఎంతో అభివృద్ధి చెందుతాయన్నారు.మహిళలను ప్రోత్సహించినట్లయితే సమాజంలో వారికంటూ ప్రత్యేక స్థానం సాధించడంతోపాటు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారన్నారు. అనంతరం సినీ నటి శివపార్వతి మాట్లాడుతూ నేను పుట్టి పెరిగిందంతా తెనాలి అయినా,40 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి  స్థిరపడ్డానని అన్నారు.

తెలంగాణ ప్రజలు మనసులో ఒకటి పెట్టుకొని,బయటికి ఒకలా మాట్లాడే వారు కారని, తెలం గాణ ప్రజలంతా నిష్కల్మషమైన మనసు కలిగినవారన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కౌన్సిలర్లు గాజుల సుజాత, ప్రణయ ధనరాజ్ యాదవ్, బాలాజీ నాయక్, మాజీ కో ఆప్షన్ సభ్యులు చంద్రగిరి సతీష్, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, నాయకులు బొబ్బ శ్రీనివాస్, బస్తీ వాసులు, మహిళలు పాల్గొన్నారు.