calender_icon.png 26 October, 2024 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఆకేరు వాగులో కారు గల్లంతు.. మహిళ మృతదేహం లభ్యం

01-09-2024 04:26:11 PM

మహబూబాబాద్ : జిల్లాలో ఆకేరు వాగులో ఆదివారం ఉదయం కారు గల్లంతైంది. మరిపెడ మండలంలోని పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరు వాగు బ్రడ్జిపై నుండి వెలుతున్న వరదనీరు వరద ప్రవాహంలో కారు కొట్టుకపోయింది. ఆకేరు వాగులో కొట్టుకుపోయిన కారులో నునావత్ మోతీలాల్, మహిళా అశ్వని ఉన్నారు. అయితే సమీపంలోని పామాయల్ తోటలో అశ్విని మృతదేహం లభ్యం అయినట్లు పోలీసులు తెలిపారు. ఆకేరు వాగులో గల్లంతైన మోతీలాల్ కోసం స్థానికులు గాలిస్తున్నారు. మరణించిన అశ్విని ఢిల్లీలో విత్తన పరిశోధన శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.