calender_icon.png 25 February, 2025 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే కాన్పులో ముగ్గురు చిన్నారుల జననం

25-02-2025 12:13:39 AM

 గజ్వేల్, ఫిబ్రవరి 24 : గజ్వేల్ లోని  ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఓ మహిళ సోమవారం ఒకే కాన్పులో ముగ్గురు చిన్నారులకు జన్మనిచ్చింది.  గజ్వేల్ నియోజకవర్గం లోని ములుగు మండలంలోని అడవి మసీదు గ్రామానికి చెందిన నర్సింలు భార్య నాగరత్న  ప్ళ్ళున ఏడు సంవత్సరాలకు గర్భం దాల్చింది.గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం మొదటి కాన్పులోనే ముగ్గురు పిల్లలు (ఇద్దరు మగ, ఒక ఆడబిడ్డ)లకు జన్మనివ్వడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ మాట్లాడుతూ గజ్వేల్ లోని  ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, తమ ఆసుపత్రిలో  మహిళకు జరిగిన కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించడం చాలా సంతోషంగా ఉందన్నారు.  ఇందుకు కృషి చేసిన డాక్టర్ మంజుల, డాక్టర్ త్రివేణి  అనస్థీషియా సుశీల , అఫ్రోజ్, ఓటీ సిబ్బందిని అభినందించారు.

గజ్వేల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో  గైనకాలజీ తోపాటు అన్ని విభాగాలలో  ఎంతో అనుభవం గల వైద్యులతో సేవలందిస్తున్నామని, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూపరిండెంట్  డాక్టర్ అన్నపూర్ణ  సూచించారు. ఆమె వెంట డాక్టర్ మంజుల, డాక్టర్ త్రివేణి,  పీడియాట్రిక్ డాక్టర్ రాము, డాక్టర్ సుశీల అనేస్థేషియా సునీత నర్సింగ్ ఆఫీసర్,  ఆపరేషన్ టెక్నీషియన్ వెంకట్, రాజేష్. థియేటర్ సిబ్బంది  పాల్గొన్నారు.