calender_icon.png 21 October, 2024 | 9:08 AM

స్త్రీ 3కి కథ దొరికేసింది..

20-10-2024 12:16:26 AM

స్త్రీ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో సీక్వెల్స్‌కు దర్శకుడు అమర్ కౌశిక్ తెరదీశారు. స్త్రీ 2 సినిమాకు కూడా మంచి స్పందన లభించింది. ప్రస్తుతం స్త్రీ 3ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. స్త్రీ 2 చిత్రంలో శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమా సక్సెస్‌పై ఓ ఇంటర్వ్యూలో శ్రద్ధా కపూర్ మాట్లాడారు. “స్త్రీ చూసినప్పుడు ఇలాంటి సినిమా ఇప్పటి వరకూ చూడలేదనిపించింది. ఆ తర్వాత దాని సీక్వెల్ కోసం నన్ను సంప్రదిం చడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

స్త్రీకి మించిన ఆదరణ సీక్వెల్‌కు లభించింది. దీన్ని ఇంత బాగా తెరకెక్కించినందుకు దర్శక, నిర్మాతలకు హ్యాట్సాఫ్ చెప్పాలి. మూడో పార్ట్ ఇంతకు మించి ఉంటుంది. దీనిలో చాలా డెవలప్‌మెంట్స్ చేసి పనులను కూడా ప్రారంభిం చారు” అని శ్రద్ధా వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుగా ప్రేక్షకుల ముందుకు స్త్రీ 2 వచ్చింది. ఒక గ్రామంలో స్త్రీ సమస్య తొలగిందని ఆనందించే లోపు మరో గ్రామంలో కొత్త సమస్య ప్రారంభమవుతుంది. ఈ సమస్యను రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ తదితరులు ఎలా ఎదుర్కొన్నారనేదే సినిమా కథాంశం. స్త్రీ 3 కూడా త్వరలోనే ప్రారంభమవుతుందని వెల్లడించారు.