calender_icon.png 26 February, 2025 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళ అదృశ్యం..

17-02-2025 11:06:57 PM

చేవెళ్ల: మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ అదృశ్యం అయ్యింది. పోలీసుల వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన కృష్ణకాంత్ దాస్ అతని భార్యత బైసాఖి దులే(18) తో కలిసి ఆరు నెలల కింద వలస వచ్చారు. మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ లోని పీఎంఆర్ క్రికెట్ గ్రౌండ్ లో లేబర్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం సాయంత్రం బార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో బైసాఖి భర్తకు చెప్పకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయి తిరిగి రాలేదు. కృష్ణకాంత్ దాస్ చుట్టు పక్కల వెతికితే ఆచూకీ దొరకలేదు. దీంతో సోమవారం మొయినాబాద్  పీఎస్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.