calender_icon.png 26 December, 2024 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబులెన్స్ లో సాధారణ ప్రసవం

02-10-2024 10:02:54 AM

తల్లీ బిడ్డ క్షేమం.                           

అచ్చంపేట : తీవ్ర పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి అంబులెన్స్ సిబ్బంది సరైన సమయంలో స్పందించి సాధారణ కాన్పు చేశారు. అచ్చంపేట మండలం దుబ్బ తండా గ్రామానికి చెందిన ముడావత్ సిరి(28) పురిటి నొప్పులతో బాధపడుతూ అంబులెన్స్ 108 ని ఆశ్రయించింది. సమాచారం అందుకున్న సిబ్బంది సరైన సమయంలో స్పందించి పురిటి నొప్పులు అధికం కావడంతో హైరిస్క్ కేసును సైతం అంబులెన్స్ లోనే సాధారణ కాన్పు ద్వారా మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో జిల్లా మేనేజర్ బోయిని శ్రీను పైలట్ శ్యామ్ రాజు, ఈఏంటి ఆంజనేయులుని అభినందించారు. అనంతరం తల్లి బిడ్డలను ఇరువురిని వైద్య పరీక్షలు నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.