calender_icon.png 28 December, 2024 | 2:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

108 అంబులెన్స్ లో సుఖ ప్రసవం

03-11-2024 11:59:25 AM

కొండపాక (విజయక్రాంతి): పురిటి నొప్పులతో బాధపడుతున్న చిట్యాల గ్రామానికి చెందిన చేర్యాల సౌందర్య అనే మహిళ కు ఆదివారం ఉదయం నొప్పులు ఎక్కువ కావడంతో కొండపాక 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో, సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకొని అంబులెన్స్ లో సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ కు బయలుదేరగా రోడ్డు మార్గమధ్యంలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్ ను పక్కకు ఆపి హైదరాబాదులోని ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీస్ హెడ్ ఆఫీస్ ఎమర్జెన్సీ డాక్టర్ సలహాలు పాటిస్తూ 108 అంబులెన్స్ మెడికల్ టెక్నీషియన్ గణేష్ ఆ మహిళకు సుఖప్రసవం చేశాడు. ఆ మహిళకు పండంటి మగ బిడ్డ పుట్టాడు,తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు,ఈ ప్రసవంతో గణేష్ నాల్గవ ప్రసవం చేశానని అన్నాడు. మెడికల్ టెక్నీషియన్ గణేష్ ను, పైలెట్ రమేష్ ను హాస్పిటల్స్ సిబ్బంది మరియు బంధువులు అభినందించారు.