జగిత్యాల, (విజయక్రాంతి): ఓ మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఇంట్లోనే ప్రసవం. పాతకాలం పద్దతిలో బిడ్డకు పురుడుపోసిన మాజీ సర్పంచ్ వైనమిది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం రాగోజీపేట గ్రామానికి చెందిన కల్లెం కోమలత అనే మహిళకు శనివారం రాత్రి పురిటినొప్పిలు వచ్చాయి. గత రెండు రోజుల క్రితం ఆస్పత్రికి తీసుకెళ్లగా ఇంకా సమయం ఉందని చెప్పటంతో ఇంటికి వచ్చారు.
అదే సాయంత్రం సమయంలో ఒక్కసారిగా పురిటినొప్పులు రావటంతోపాటు మరోవైపు విపరీతమైన వర్షం ఉండటంతో మాజీ సర్పంచ్ ఓ వైపు బాలసాని లహరికకు చెప్పి, మరో వైపు అంబులెన్స్ వారికి సమాచారం అందించారు. నొప్పులు ఎక్కువ రావటంతో ప్రసవం చేసింది. పండంటి మగ బిడ్డ జన్మించారు. అంతలోపు అంబులెన్స్ కు సమాచారం అందించటంతో అంబులెన్స్ సిబ్బంది వచ్చి తల్లీబిడ్డలను అసుపత్రికి తరలించారు.