31-03-2025 09:21:37 AM
దైవదర్శనం కోసం వచ్చిన ఓ వివాహిత మహిళపై యువకుల గ్యాంగ్ రేప్.
అఘాత్యాలకి పాల్పడ్డ వారిలో ఆలయ ఉద్యోగి.
అడ్డుకున్న కుటుంబ సభ్యులను ఆళ్ళతో కట్టేసిన వైనం
నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూలు జిల్లా(Nagarkurnool District) ఊరుకొండ పేట ఆంజనేయస్వామి(Urkondapeta Sri Anjaneya Swamy Temple) ఆవరణలో ఘోరం జరిగింది. దర్శనం కోసం వచ్చిన ఓ వివాహిత మహిళపై ఆలయ ఉద్యోగితోపాటు మరో ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకున్న కుటుంబ సభ్యులను చేతులు కాళ్లు కట్టేసి దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకోగా సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉమ్మడి పాలమూరు జిల్లా(Mahbubnagar district) భూత్పూర్ మండలం పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత(30) మహిళ శనివారం రాత్రి అంజన్న దర్శనం కోసం ఊరుకొండ పేట ఆంజనేయస్వామి ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చింది. దర్శనం అనంతరం నిద్రకు ఉపక్రమించారు. అనంతరం బహిర్భూమికి వెళ్లినట్లు మాటు వేసి గుర్తించిన యువకులు పక్కనే ఉన్న గుట్ట పైకి ఈడ్చుకెళ్ళి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానించి వెతుకుతుండడంతో వారిని గ్రహించిన యువకులు చేతులు కాళ్లను తాళ్లతో కట్టేసి పరారయ్యారు. అఘాయిత్యానికి పాల్పడ్డ వారిలో ఆలయ ఉద్యోగితో పాటు బంగారు ఆంజనేయులు, మట్ట ఆంజనేయులు, బాబా, కౌకుంట్ల అరిష్, మహేష్, వాగుల్ధార్ మణికంఠలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించినట్లు తెలిపారు.