రాజేంద్రనగర్, డిసెంబర్29: మద్యం మత్తులో ఓ మహిళ ఇండిగో విమానంలో హల్‌చల్ చేసింది. ఆర్‌జీఐఏ పోలీసులు తెలిపిన వివరాలు.. శంషాబాద్ నుంచి ముంబై వెళ్లే ఓ విమానంలో మహిళా ప్రయాణికురాలు ఎక్కింది. మద్యం మత్తులో ఉన్న ఆమె విమానంలో నానా రచ్చ చేసింది. తోటి ప్రయాణికులను దుర్భాషలాడుతూ హంగామా సృష్టించింది. ఆమె రచ్చ ఎక్కువ కావడంతో విమాన సిబ్బంది సీఐఎస్‌ఎఫ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆమెను అదుపులోకి తీసుకొని ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించారు.