calender_icon.png 14 April, 2025 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాబ్‌లో నగలు మర్చిపోయిన మహిళ

13-04-2025 12:00:00 AM

పోలీసుల చొరవతో తిరిగి అప్పగింత

డ్రైవర్‌ను ప్రత్యేకంగా అభినందించిన ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు 

 రాజేంద్రనగర్, ఏప్రిల్ 12: క్యాబ్ లో ప్రయాణించిన ఓ మహిళ అందులో బంగా రు నగలను మర్చిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సకాలంలో స్పందించి బంగారాన్ని తిరిగి అప్పగించారు. ఈ సంఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. స్థానిక జలాల్ బాగ్ నగర్‌లో నివసించే సమీనా బేగం శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఉబర్ క్యాబ్లో బాలానగర్ నుంచి తన ఇం టికి వచ్చింది. సాయంత్రం 4:30 గంటలకు చేరుకున్న ఆమె క్యాబ్లో తన బ్యాగు, మేకప్ కిట్ మర్చిపోయింది. బ్యాగు లో నాలుగున్నర తులాల బంగారు నగలు ఉన్నాయి.

వెంటనే విషయాన్ని గమనించిన బాధితురాలు అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది అప్రమతమయ్యారు. క్యాబ్ డ్రైవర్ వివరాలు సేకరించి అతడికి కాల్ చేసి పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. కార్ లో ఉన్న బ్యాగు, అందులో ఉన్న బంగారాన్ని తిరిగి బాధితురాలు సమీనా బేగంకు అప్పగించారు. ఈ సందర్భంగా క్యాబ్ డ్రైవర్  పానుగంటి మణిపాల్ ను ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు.