12-02-2025 12:53:59 AM
హుస్నాబాద్ : బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ మహిళకు తహసీల్దార్ జరిమానా విధించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కుందెనవానిపల్లికి చెందిన బానోత్ సుగుణ గుడుంబా అమ్ముతూ పట్టుబడి బైండోవర్ అయినా, మళ్లీ గుడుంబా అమ్ముతూ దొరికిపోవ డంతో తహసీల్దార్ అనంతరెడ్డి రూ.50 వేల జరిమానా విధించారు.
హుస్నాబాద్ ఎక్సైజ్ సీఐ పవన్ తెలిపిన వివరాల ప్రకారం బానోత్ సుగుణ గతంలో గుడుంబా అమ్ముతుండగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఆమెను తహసీల్దార్ ముందు బైండోవర్ చేశారు. అయినా ఆమె బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తూ గుడుంబా అమ్ముతోంది. సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్ ఎస్త్స్రలు దామోదర్, రూప సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారు.
అనంతరం ఆమెను తహసీల్దార్ అనంతరెడ్డి ముందుకు తీసుకెళ్లారు. గతంలో ఉన్న నేరచరిత్రతోపాటు బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆమెకు తహసీల్దార్ రూ.50వేల జరిమానా విధించారు. ఎవరైనా గుడుంబా తయారు చేసినా, అమ్మినా, రవాణా చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అయినా మారకపోతే పీడీ యాక్టు నమోదు చేస్తామని ఎక్సైజ్ సీఐ హెచ్చరించారు.