రుణం కోసం బ్యాంకు చుట్టూ తిప్పుతున్నారని ఆరోపణ
కామారెడ్డి జిల్లా బిర్కుర్ సహకార బ్యాంక్ ఎదుట ఘటన...
కామారెడ్డి (విజయక్రాంతి): వంట రుణం ఇవ్వడం లేదని ఓ మహిళా రైతు బ్యాంక్ ఎదుట ఆందోళన చేసిన ఘటన మంగళవారం కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం బైరాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు మహిళా రైతు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం బైరాపూర్ గ్రామ సహకార బ్యాంక్ ఎదుట బొప్పన్ పల్లి తండా చెందిన మాన్ సింగ్ భార్య అంజు బాయ్ పట్ట రుణం ఇవ్వాలని సహకార బ్యాంక్ చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. పంట రుణం మాఫీ అయిందని కొత్త రుణం ఇవ్వాలని కోరితే అధికారులు కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు తప్ప రుణం ఇవ్వడం లేదని మహిళ రైతు అంజు బాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. పంట రుణం ఇవ్వకుంటే సొసైటీ ముందే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.
ఈ విషయంపై సహకార బ్యాంక్ కార్యదర్శి భూమయ్యను విలేకరులు వివరణ కోరగా మహిళా రైతు తన భూమిని అమ్ముకున్నారని ఆ భూమిపై రుణం ఇవ్వాలని కోరుతూ తాము రుణం ఇవ్వలేమని చెప్పిన మహిళా రైతు అంజుభాయ్ వినకుండా బ్యాంక్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారని తెలిపారు. సర్వేనెంబర్ 11/3 లో ఆర ఎకరం ప్రభుత్వ భూమి ఉండగా ఆ భూమిని రాందాస్ అని రైతుకు అమ్ముకున్నారని తెలిపారు.