మంథని (విజయక్రాంతి): విద్యుత్తు షాక్ తో మంథని మండలంలోని అడవి సోమన్ పల్లిలో మహిళ రైతు మృతి చెందింది. మంథని ఎస్ఐ రమేష్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కడారి లక్ష్మి (51) బుధవారం ఉదయం 10 గంటల సమయంలో తన వ్యవసాయ పొలం వద్ద ఒడ్డుపై గల గడ్డి కోస్తున్నా క్రమంలో ఒడ్డుపై ఉన్న బోరు వైరును ప్రమాదవశాత్తు చూడకుండా కోయగా కరెంటు వైర్ తెగి విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయిందని, ఆమె కూతురు సడిరం రాజేశ్వరి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు.