calender_icon.png 14 February, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

14-02-2025 01:54:19 AM

లైంగికదాడి అనంతరం హత్య జరిగినట్లు  అనుమానం 

నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 13 (విజయ క్రాంతి): అనుమానాస్పద స్థితిలో మహిళ హత్యకు గురైన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రి వెనుక భాగంలోని ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్ గెట్ ముందు గురువారం చోటు చేసుకుంది.  గుర్తు తెలి యని దుండగుల చేత అత్యాచారం అనంత రం హత్యకు గురైనట్లు స్థానికులు ఆహ్వాని స్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసు లు సంఘటన స్థలానికి చేరుకొని విచారిం చగా ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన కావాలి శాంతమ్మ (50)గా గుర్తించారు. 

కొంత కాలంగా అనారోగ్యంతో బాధప డుతూ జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వచ్చేదని భర్త, పిల్లలు ఎవరూ లేకపోవడంతో యాచిస్తూ జనరల్ ఆస్పత్రి పరిసరాల్లోనే గడిపేదని తెలిపారు. కాగా గుర్తు తెలియని దుండగులు ఆమెపై అఘా యిత్యానికి పాల్పడి హత్య చేసినట్లు అను మానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులకు పరిసరాల్లోనే హమాలీలు ధరించే చొక్కా, తాళం చేతులు వంటి కొన్ని ఆధారాలను సేకరించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు.