calender_icon.png 19 April, 2025 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానాస్పదంగా మహిళ మృతి

19-04-2025 05:11:58 PM

నాగారం: అనుమానాస్పదంగా మహిళ మృతి చెందిన సంఘటన నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారంగా వట్టే భద్రమ్మ(55) ఊరు చివర వ్యవసాయ భూముల్లో విసర్జనకు వెళ్లి మృతి చెందినట్లు, తనకు ఉన్నటువంటి వ్యవసాయ భూమిలో వరి చేను కోయనివ్వకుండా కొందరు వ్యక్తులు అడ్డుపడుతున్నారని అందుకు మనస్థాపానికి గురైన మాహిళా రైతు భద్రమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నదనీ పలు అనుమానాలతో కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డాగ్స్, క్లూస్టీ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామనీ కుమారుడు పుల్లయ్య ఫిర్యాదు మేరకు శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని తుంగతుర్తి ప్రభుత్వాసుపత్రికి  తరలించినట్లు సిఐ రఘువీర్ రెడ్డి తెలిపారు.