calender_icon.png 2 April, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానాస్పదంగా మహిళ మృతి

27-03-2025 12:43:08 AM

లొంగిపోయిన నిందితుడు

పెబ్బేరు మార్చి 26: మండల పరిధిలోని రంగాపురం ఎబిడి లిక్కర్ కంపెనీ సమీపంలో ఒక మహిళ అనుమానాస్పదంగా మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున ఎర్రవల్లి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గొల్ల మద్దిలేటి పెబ్బేరు ఎస్త్స్ర హరిప్రసాద్ రెడ్డి కి లొంగి పోయాడు.

ఎస్త్స్ర, క్లూస్ టీమ్ ను పిలిపించి సంఘటనా స్థలానికి నిందితుడు మద్దిలేటి తో పాటు చేరుకుని విచారణ తో పాటు కేసు రీకన్స్ట్రక్షన్ చేసారు. వనపర్తి మండలం పెద్ద గూడెం గ్రామానికి చెందిన ముష్టి గొల్ల మణెమ్మ (35)తో నిందితునికి గత ఐదు సంవత్సరాలుగా అక్రమ సంబంధం ఉందని, అదే క్రమంలో నిన్న రాత్రి ఇద్దరూ కలుసుకున్నట్లు నిందితుడు తెలిపారు.

సదరు మహిళ మద్యం మత్తులో ఉన్నప్పుడు ఇద్దరు శారీరకంగా కలిసినప్పుడు వెక్కిళ్లు వచ్చి స్పృహ కోల్పోయిందని, తేరుకునే లోపు నోట్లో నుండి నురగలు వచ్చి అఛేతనంగా పడి ఉందని నిందితుడు తెలిపారు. పదిహేను సంవత్సరాల క్రితం మృతురాలి భర్త ముష్టి గొల్ల సాయిలు మృతి చెందారని, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. సంఘటనా స్థలాన్ని కొత్తకోట సిఐ రాంబాబు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఆసుపత్రి కి తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్త్స్ర, స్థానిక పోలీస్ సిబ్బంది, క్లూస్ టీమ్ పాల్గొన్నారు.