కోదాడ, డిసెంబర్3: కరెంట్ షాక్‌తో ఓ మహిళ మృతిచెందిన ఘటన మంగళవారం రాత్రి కోదాడ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. రూరల్ ఎస్సై అనిల్‌రెడ్డి వివరాల ప్రకారం.. కొమరబండకు చెందిన షేక్ నస్రీన్ (28) చిన్నారులకు స్నానం చేయించేందుకు వాటర్ హీటర్ పెడుతుండగా, విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయింది. కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిం చారు. అప్పటికే నస్రీన్ మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.