భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పరిధిలోని పినపాక మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన కొమరం సమ్మక్క సోమవారం ఉదయం విద్యుత్ షాక్ కు గురై మృతి చెందింది. వివరాల్లోకి వెళితే సమ్మక్క తన ఇంట్లో స్పృహ తప్పి పడి ఉండటంతో చుట్టుపక్కల వాళ్ళు ఆమెను మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రిక తరలించారు. ఆమెను వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.