హైదరాబాద్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పులి దాడిలో మహిళ మృతి చెందింది. కాగజ్ నగర్ మండలం గన్నారం శివారులో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పత్తి తీయడానికి వెళ్లిన మోర్లె లక్ష్మి(21)పై పులి దాడి చేసింది. పులి దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తోటి కూలీలు కేకలు వేయడంతో పులి పారిపోయింది. మృతదేహంతో కాగజ్ నగర్ అటవీ శాఖ కార్యాలయం ముందు న్యాయం చేయాలంటూ మృతురాలు బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.