calender_icon.png 20 March, 2025 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టూరిస్టు బస్సుపైకి దూసుకెళ్లిన డీసీఎం.. మహిళ మృతి

20-03-2025 08:09:11 AM

హైదరాబాద్: మెదక్ జిల్లా(Medak District)లో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. పెద్దశంకరంపేట మండలం(Pedda shankarampet Mandal) కోలపల్లి వద్ద వేగంగా దూసుకొచ్చిన డీసీఎం  ఆగివున్న బస్సును ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందింది. విజయనగరం నుంచి 40 మంది ప్రయాణికులు తీర్థయాత్రలకు బస్సులో వెళ్లారు.షిరిడీ నుంచి శ్రీశైలం(Srisailam)వెళ్తూ టీ తాగేందుకు కోలపల్లి డ్రైవర్ బస్సు ఆపాడు. ఆగివున్న టూరిస్టు బస్సుపైకి డీసీఎం దూసుకొచ్చింది. బస్సు వద్దే నిల్చుని ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి(Government Hospital) తరలించారు. బస్సులో ఉన్నవారు కిందకు దిగడంతో ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.