13-04-2025 06:58:54 PM
మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోని యాపల్ సమీపం లోని జిఎం కార్యాలయం వెళ్లే దారి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన అంగన్ వాడి టీచర్ మహంకాళి భూదమ్మ (65) అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని జీఎం కార్యాలయం రోడ్డు నుండి ఇల్లందు క్లబ్ సమీపంలోని తన ఇంటికి వెళ్లేందుకు రోడ్డును దాటుతుండగా బెల్లంపల్లి నుండి మంచిర్యాల వైపు వెళ్తున్న కారు డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా వాహ నాన్ని నడిపి బాధిత మహిళ ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిది. ప్రమాద సమా చారం అందు కున్న వెంటనే పట్టణ ఎస్సై రాజశేఖర్ హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మృతురాలి కుమారు డు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలి
పట్టణంలోని యాపల్ జీఎం కార్యాలయం సమీపంలో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో జీఎం కార్యాలయం సమీపంలోని జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని వాసులు కోరుతున్నారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జి లేకపోవడంతో జిఎం కార్యాల యం వాసులు రోడ్డు దాటేందు కు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. ఇప్పటివరకు ఇక్కడ జరిగిన ప్రమాదంలో స్థానికులు మృత్యువాత పడ్డారని,అనేక మంది క్షతగాత్రుల్లో మారారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని రోడ్డు ప్రమాదాలు జరగక ముందే జాతీయ రహదారి అధికారు లు, ప్రజా ప్రతినిధులు స్పందించి యాపల్ సమీపం లోని జిఎం కార్యాలయం వెళ్ళే దారి వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించి రోడ్డు ప్రమాదాలు నివారించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
ప్రజలు జాగ్రత్త వహించాలి: ఎస్సై రాజశేఖర్
పట్టణంలోని యాపల్ ఎరియా వాసులు జాతీయ రహదారి దాటే క్రమంలో జాగ్రత్తగా వ్యవహరించి ఇరువైపులా చూసిన అనంతరమే రోడ్డు దాటాలని పట్టణ ఎస్సై రాజశేఖర్ కోరారు. జాతీయ రహదారిపై జన సమూహం ఉన్న ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా వెళ్లాలని ఈ మేరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటా మని ఆయన ఆన్నారు. పాదచారులు రోడ్డు దాటే సమయంలో జాగ్రత్తలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.