నిజామాబాద్,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని నెహ్రూ పార్క్ వద్ద అశోక్ లేలాండ్ గూడ్స్ వాహనం బైకును ఢీకొట్టింది. నడుచుకుంటూ వెళుతున్న వారిని వాహనం ఢీకొనడంతో తల్లి కూతుర్లకు తీవ్ర గాయాలు కాగా, ద్విచక్ర వాహనం ధ్వంసమైంది. గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం తల్లి మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.