నారాయణఖేడ్: కల్లేరు మండలం నాగ్ధర్ గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి మహిళ మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కందిప్రేమల (52 )ఉదయం వంట చేస్తున్న క్రమంలో ప్రమాద వశత్తు గ్యాస్ సిలిండర్ కు మంటలు వ్యాపించి పేలడంతో మృతి చెందడం జరిగిందన్నారు. విషయం గమనించిన చుట్టుపక్కల వారు తేరుకునే లోపు ప్రమాదం జరిగింది. విషయం గ్రామస్తులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. మృతురాలు ప్రేమల దివ్యాంగురాలు అని ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడని స్థానికులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుము కున్నాయి.