01-03-2025 08:33:52 PM
కామారెడ్డి (విజయక్రాంతి): పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు ఓ గిరిజన మహిళ ప్రాణం బలి తీసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట శివారులో శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మాచారెడ్డి మండలం గజియా నాయక్ తండాకు చెందిన లావుడియా పారలి (50) సంవత్సరాలు అనే మహిళ పంట పొలం వద్ద విద్యుత్తు తీగలు తగిలి మృతి చెందింది. లచ్చపేట శివారుకు ఎందుకు వెళ్లిందని అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సంఘటన స్థలాన్ని కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి కామారెడ్డి రూరల్ సీఐ రామన్ మాచారెడ్డి ఎస్సై అనిల్ కుమార్ సందర్శించారు. మృతురాలు ఇంటి నుంచి లచ్చపేట శివారుకు ఎందుకు వెళ్లిందని కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.