calender_icon.png 12 January, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ షాక్ తగిలి మహిళ మృతి

06-12-2024 10:54:29 PM

కామారెడ్డి (విజయక్రాంతి): నివాసముంటున్న రేకుల షెడ్డుకు విద్యుత్ సర్వీస్ వైరు తగలడంతో విద్యుత్ షాక్ కు గురై మహిళ మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సాతేల్లి గ్రామానికి చెందిన ఎరుకల లక్ష్మి (35) అనే మహిళ శుక్రవారం విద్యుత్ షాక్ తగిలి మృతి చెందింది. లక్ష్మి ఇంటిపై ఉన్న రేకులకు సర్వీస్ వైర్ తగలడంతో విద్యుత్ సరఫరా జరిగి కరెంట్ షాక్ తగిలింది, దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మహిళ మృతి చెందినట్లు ఎల్లారెడ్డి పోలీసులు తెలిపారు. మృతురాలికి భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు.