26-02-2025 10:17:20 PM
మహాదేవపూర్ (విజయక్రాంతి): ద్విచక్ర వాహనం అదుపుతప్పి మహిళ మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాలేశ్వరం అటవీ ప్రాంతంలోని టర్నింగ్ వద్ద జరిగింది. భార్యాభర్తలిద్దరూ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కోతులు అడ్డు రావడంతో స్పీడుతో ఉన్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవడంతో భార్యాభర్తలు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 ద్వారా మహాదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చికిత్స అనంతరం ఎంజీఎం వరంగల్ వెళుతున్న సమయంలో మార్గమధ్యలో భార్య భాగ్య మృతి చెందింది. వీరు భూపాల్ పల్లి జంగేడు గ్రామానికి చెందిన సమ్మయ్య, భాగ్య దంపతులుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.